అలరించే అనుక్షణం
మరపించే మరుక్షణం
కనిపించే నవ్వుని కనిపించని మనసుని
పంచుకునే సంతోషాన్ని పంచలేని బాధని
కురిసే వర్షాన్ని కురిపించే మేఘాన్ని
వచ్చే కన్నీటిని తెప్పించే నొప్పిని
అర్ధం చేసుకునే మిత్రులని అర్ధం చేసుకోలేని బంధువులని
ప్రేమని పంచె అమ్మని ప్రేమించలేని బొమ్మని
మరువను ఎన్నటికి మరచిపోలేను ఇప్పటికి ఎప్పటికి ఇంకెప్పటికి.
No comments:
Post a Comment